సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ, సామాజిక అంశాలతో నిత్యం సోషల్ మీడియాలో స్పందించే ఆయన...లేటెస్ట్ గా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చేసిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అనూహ్య ఓటమిని చవిచూసింది. బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. కమల దళం అధికారం చేపట్టేందుకు రెడీ అయింది. అయితే మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేదిలేదంటూ మొండికేశారు. బీజేపీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ మమత తన మొండితనాన్ని సమర్థించుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఈ పరిణామంపై ఆర్జీవీ తీవ్రంగా స్పందించారు. దశాబ్దాల రాజకీయ అనుభవం, 15 ఏళ్లపాటు సీఎంగా ఉన్న మమతా బెనర్జీ.. ప్రజాస్వామ్య మూలసూత్రాలను విస్మరించడం ఆశ్చర్యంగా ఉందంటూ ఆర్జీవీ పోస్ట్ చేశారు. వ్యవస్థలపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే అని ఎక్స్ వేదికగా విమర్శించారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.















