🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by simplysouth
🛕
హైదరాబాద్, తెలంగాణ

హయత్ బక్షి బేగం మాస్కు

హయత్ బక్షి బేగం మాస్క్ అని లేదా హయత్ బక్షి మాస్క్ అని ఇంకా హయత్నగర్ గ్రాండ్ మాస్క్ అని కూడా పిలువపడుతుంది. ఈ మసీదు హైదరాబాద్ లోని ముస్లిములకు చాలా పవిత్రమైనది.1672 లో అయిదవ సుల్తాన్ అయిన అబ్దుల్లా కుతుబ్ షా పాలించిన సమయంలో ఈ మాస్క్ నిర్మితమయింది. ఖుతుబ్ షా కుటుంబీకుల పరిపాలకుల హయాంలో నిర్మించబడిన ఈ మాస్క్ ఖుతుబ్ షాహి శైలిలోనే నిర్మితమయింది.

ఈ మసీదులో ప్రార్ధనలు చేసుకోవడమే కాకుండా ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పర్యటించే పర్యాటకులకు విశ్రాంతి ని అందించే ప్రదేశం గా కూడా ఈ మసీదు ఉపయోగపడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని అలసిన ప్రయాణికులకి విశ్రాంతి మందిరంగా ఒక సారాయ్ ని ఏర్పాటు చేసారు. ఈ మసీదు యొక్క నిర్మాణ పద్దతిలో అయిదు కమానులు ఉంటాయి.

ఒక పిట్ట గోడ, ప్రార్ధనా మందిరం, రెండు స్థంబాలు, శిల్పాలు కలవు. గాలరీ ల మీదుగా ఉన్న పిట్టగోడ పన్నెండు ప్రోట్రుషన్స్ మీదుగా వెళ్తుంది. ఒక ఎత్తైన వేదిక మీద ప్రార్ధనా మందిరం ఏర్పాటు చేసారు. ఈ మసీదు కి కిందనే ఏర్పాటు చేసిన ప్రాంతంలో కాళ్ళు, చేతులు కడుగుకునే సదుపాయం కలదు.

🛕 మరిన్ని తెలంగాణ ప్రదేశాలు

Advertisement
Sponsored by ATA – American Telugu Association