
ఇందిరా పార్క్ చుట్టూ పచ్చని చెట్లతో నిండి ఉంటుంది. ఇది హైదరాబాద్ కి గుండెకాయ వంటిది. దీనిని 1975 - 78 మధ్యకాలంలో ప్రారంభించినారు. హైదరాబాద్ లో కెల్లా పురాతన పార్కులలో ఇదికూడా ఒకటి. సుమారు 76 ఎకరాల విస్తీర్ణంలో హుస్సేన్ సాగర్ సరస్సు ఒడ్డున ఉన్నది. దీనిని పునర్నిర్మించేటప్పుడు చెట్టు,పుట్టలను కదల్చకుండా నిర్మాణం చేశారు. ఇక్కడ గల ప్రధాన ఆకర్షణలు మ్యూజికల్ డ్యాన్సింగ్ ఫౌంటన్, వాటర్‌ఫాల్స్ మరియు నర్సరీలు. ఇక్కడ ఒక చిన్న కొలను మాదిరి కుంటలు ఉన్నాయి. అంతేకాదు వివిధ రకాల రోజా పూలు ఉన్నాయి. ఇందిరా పార్కులో బోటింగ్ భలే అందాన్ని ఇస్తుంది.
సందర్శించు సమయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటలవరకు. వారం లోని అన్ని రోజులలో తెరిచే ఉంటుంది.
టికెట్ ప్రవేశ రుసుము: 5 రూపాయలు
రవాణా సదుపాయం ఇందిరా పార్క్ క్రాస్ రోడ్ బస్ స్టాప్ దగ్గరలో ఉన్న బస్ స్టాప్.








