🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by simplysouth
🛕
హైదరాబాద్, తెలంగాణ

ఉజ్జయిని మహంకాళి టెంపుల్

హైదరాబాద్ లో లో ఉన్న సికింద్రాబాద్ ప్రాంతం లో ఈ శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఉంది. ఈ ఆలయం దాదాపు 200 ఏళ్ళ పుర్వానికి చెందినదని నమ్మకం. ప్రతి రోజు వందల మంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రార్ధనలు చేస్తారు. ఈ గుడిలో శక్తి కి మరియు అధికారానికి దేవత అయిన మహంకాళి మాత కొలువై ఉంటారు.

ఆదివారం మరియు సోమవారాల్లో పడే ఆషాడ జాతర పండుగ సమయంలో ఈ ఆలయం కిటకిటలాడుతుంది. మహంకాళి మాతని కొలవడానికి ఈ రెండు రోజులు చాలా మంచివి. బోనాలు పండుగని కూడా ఈ ఆలయంలో ఏంతో సంబరంగా , ఆరాధనతో జరుపుకుంటారు. ఈ పండుగని ముఖ్యంగా హైదరాబాద్ ఇంకా సికింద్రాబాద్ నగరాలలో జరుపుకుంటారు.

తెలంగాణా, రాయలసీమ నుండి ఏంతో మంది భక్తులు ఈ పండుగ సమయంలో ఈ ఆలయానికి విచ్చేస్తారు. జూలై ఇంకా ఆగష్టు మాసాలలో ఈ బోనాలు పండుగని జరుపుకుంటారు. ప్రశాంతమైన, నిలకడగా ఉన్న జీవితాన్ని భూమి పైన ప్రసాదించినందుకు కృతజ్ఞతగా ఈ బోనాలు పండుగ ద్వారా మహంకాళి మాతని ప్రార్ధించేందుకు ఈ పండుగ చేస్తారు.

🛕 మరిన్ని తెలంగాణ ప్రదేశాలు

Advertisement
Sponsored by ATA – American Telugu Association