🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by simplysouth
🛕
నల్గొండ, తెలంగాణ

రాచ కొండ కోట

రాచకొండ కోట, ఈ ప్రాంతాన్ని 14 వ,15వ శతాబ్దాలలో పాలించిన వెలమ దొరల రాజధానిగా ఉండేది. ముస్లిం బహమనీ రాజులతో వెలమ రాజులు కూటమిని ఏర్పాటు చేయడం వలన వారు దక్షిణాది పాలకులలో ఏమాత్రం జనామోదం లేని రాజులే కాక కొండవీడు ప్రాంతానికి చెందిన రెడ్డి రాజులతో నిరంతరం యుద్ధం చేసేవారు. వెలమలు వరంగల్ కాపయ్య నాయకులతో కూడా ఎప్పుడు పోరాడుతుండేవారు.

వెలమ రాజులు తమను దాడుల నుండి కాపాడుకోవడానికి కోటను నిర్మించారు, కాని ముస్లిం పాలకులు అక్రమ రీతిలో వారిపై దాడి చేసి వెలమ రాచరిక కుటుంబాన్ని తమ దాసులుగా మార్చారు. వెలమలు ఒక బ్రాహ్మణునిచే ఇక ఎన్నడు పాలించలేరని కూడా శపించబడ్డారు. ఈ శాపం కారణంగానే రాచకొండ కోట ప్రస్తుతం సంపూర్ణ శిధిలావస్థలో ఉందని కొంత మంది ప్రజలు విశ్వసిస్తారు.

అయితే, సూర్యాస్తమయానికి ముందు ఈ కోటను చూసేందుకు ప్రాధాన్యత నిచ్చే పర్యాటకుల, ఆసక్తి గల స్థానికులు ఇక్కడకు వస్తుంటారు.

🛕 మరిన్ని తెలంగాణ ప్రదేశాలు

Advertisement
Sponsored by ATA – American Telugu Association