🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
🕉️ సంస్కృతి›🧒 పిల్లల కార్నర్›📖 దురాశ దుఃఖానికి చేటు
📖
తెనాలి రామకృష్ణ

దురాశ దుఃఖానికి చేటు

duraasha duhkhaaniki cheetu

⏱️ 12 నిమిషాల పఠనం

వింధ్యారణ్యం అనే ప్రాంతంలో భైరవుడు అనే పేరుగల వేటగాడు ఉండేవాడు. రోజూ అడవికి వెళ్ళి, రకరకాల ఆహార పదార్థాలను సేకరించి, వాటితో తన కుటుంబాన్ని పోషించేవాడు. అడవిలో దొరికే ఆకులు, దుంపలు, కాయలు, పండ్లు, తేనె, వెదురు బియ్యం లాంటి వాటన్నింటి కంటే భైరవుడికి… కుందేలు, జింక, అడవిపంది వంటి జంతువుల మాంసమంటే భలే ఇష్టం.

ఒకరోజు ఒక బలసిన జింకను వేటాడి చంపిన భైరవుడు, ఇంటిల్లిపాదీ ఆనందంగా విందు చేసుకోవచ్చునే సంతోషంలో దాన్ని భుజంపైన వేసుకొని తన ఇంటి దారి పట్టాడు. అయితే ఆ అడవి మార్గంలో అతనికి అనుకోకుండా బాగా మదించి, కోరలు ఉన్న అడవి పంది ఒకటి కనిపించింది.

భైరవుడు తన భుజం మీది జింక శవాన్ని నేలపైకి దించి, తన విల్లమ్ములు తీసుకుని పదునైన బాణంతో ఆ అడవి పంది రొమ్మును గాయపరిచాడు. అసలే కోపం, మొండితనం ఎక్కువగా ఉండే అడవిపంది గాయాన్ని లెక్కచేయకుండా వేగంగా పరుగెత్తుకొచ్చి భైరవుడి పొట్టను కోరలతో చీల్చి చెండాడి, చంపివేసింది. తర్వాత గాయం బాధ ఎక్కువై అది కూడా చచ్చిపోయింది. భైరవుడు, అడవిపందిల తొక్కిసలాటలో అటుగా వచ్చిన పాము కూడా చనిపోయింది

ఇంతలో క్షుద్రబుద్ధి అనే నక్క ఆహారం వెదకుతూ అటుకేసి వచ్చింది. చచ్చిపడి ఉన్న వేటగాడు, జింక, పంది, పాము దానికి కన్నుల విందుగా కనిపించాయి. నక్కలు స్వయంగా వేటాడలేవు కాబట్టి… పులి, సింహం లాంటి జంతువులు చంపి తిని వదలిన అవశేషాలను, జీవుల శవాలను తిని తృప్తి పడతాయి. అందుకే ఒకేసారి నాలుగూ చనిపోయి కనిపించే సరికి క్షుద్రబుద్ధి ఎగిరి గంతులు వేసింది.

దగ్గరికెళ్లిన నక్క ఇలా ఆలోచించింది “ఈ మనిషి శవం ఒక మాసం పాటు తినొచ్చు. జింక, పంది శవాలను రెండు నెలల పాటు భోంచేయవచ్చు. ఈ పాము తలను తీసేసి ఒక రోజంతా కడుపునింపుకోవచ్చు. అంటే మూడు నెలల ఒక్క రోజు పాటు ఆహారం గురించి వెదికే పనే లేదన్నమాట. మరి ఈ పూట మాటేమిటి? ఆ! ఈ వేటగాని ధనుస్సుకు కట్టివున్న కమ్మని వాసన వేస్తున్న, నరాలతో చేసిన అల్లెత్రాటిని తింటే సరిపోతుంది.” అనుకుంది.

అనుకున్నదే తడవుగా నక్క వింటిని సమీపించి, లాగి బిగించి ఉన్న దాని నరాలతో చేసిన అల్లెత్రాడును కొరికింది. అంతే…! పదునైన “వింటి కోపు” దాని శరీరంలో గుచ్చుకుంది. బాధతో విలవిలలాడుతూ… తన దురాశకు చింతిస్తూ నక్క ప్రాణాలు విడిచింది. ఇప్పుడక్కడ నక్కతో కలిపి ఐదు శవాలు పడి ఉన్నాయి.

భైరవుడు ఒక జింక చాలదని అడవిపందిని వేటాడబోయి చనిపోయాడు. నక్క ఎలాంటి కష్టం లేకుండా మూడు నెలల పాటు తిండి దొరికించుకుని కూడా, పిసినారి తనంతో వింటినారిని కొరికి, తానూ శవంగా మారింది. దీన్నిబట్టి మీకెమర్థమయ్యింది పిల్లలూ…! దురాశ దుఃఖానికి చేటు. మానవుడు ఆశాజీవే కానీ అత్యాశ పనికిరాదు.

📖 మరిన్ని తెనాలి రామకృష్ణ

📖⏱️ 4 min
నక్కా, కోడి పుంజు
nakkaa, koodi pumju
📖⏱️ 20 min
నగల మూట
nagala moota
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి