🏠హోం📋సమాజం📅ఈవెంట్స్🎙️రేడియో📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయం
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🎤ఇంటర్వ్యూలు
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏠హోం
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయం
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🎤 ఇంటర్వ్యూలు
  • 🛂 ఇమిగ్రేషన్
  • రిపోర్ట్ స్టోరీ
  • మా కోసం రాయండి
🕉️ సంస్కృతి›🧒 పిల్లల కార్నర్›📖 కనువిప్పు
📖
మరిన్ని నీతి కథలు

కనువిప్పు

kanuvippu

⏱️ 14 నిమిషాల పఠనం


ఒక అడవి సమీపాన ఒక పూరిగుడిసె ఉండేది. అందులో కొండయ్య, కాంతమ్మ దంపతులు కాపురం ఉండేవాళ్ళు. కొండయ్య అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి, పట్టణంలో అమ్మేవాడు. ఇలా వాళ్ళ జీవనం సాగించేవారు. ఒక రోజు మామూలుగా కొండయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళి ఒక చెట్టు కొట్టబోయాడు. అప్పుడు వనదేవత ప్రత్యక్షమయింది. ‘చెట్టు నరకటం వలన అడవి పాడవుతుంది. చెట్టు నరకవద్దు’ అంది. కట్టెలు కొట్టి అమ్మకపోతే నా జీవితం ఎట్లా గడుస్తుంది అన్నాడు కొండయ్య. అప్పుడు వన దేవత ‘నీకు ఒక పాడి ఆవును ఇస్తాను. దాని పాలు అమ్ముకొని సుఖముగా జీవించు’ అంది. కొండయ్య సరేనన్నాడు. వనదేవత అతనికి ఒక పాడి ఆవును ఇచ్చింది.

వనదేవత అతనికి ఒక పాడి ఆవును ఇచ్చింది. కొండయ్య ఆవును తోలుకొని ఇంటికి వచ్చాడు. భార్యకు చూపాడు. ఆమె కూడా చాలా సంతోషించింది. రోజూ పాలు అమ్మగా వచ్చే డబ్బుతో వాళ్ళ జీవితం గడిపేవారు. కొన్ని రోజులు గడిచాయి. రోజూ ఆవుకి మేత వేయాలి, పాలు పితకాలి. కాంతమ్మకు విసుగువేసింది. కష్టపడకుండా డబ్బు సంపాదించాలి. భర్తను మళ్ళా అడవికి పంపింది. కొండయ్య ఆవును తోలుకొని అడవికి వెళ్ళాడు. గొడ్డలితో ఒక చెట్టు నరకబోయాడు. వనదేవత ప్రత్యక్షమయింది. ఏమిటి కొండయ్యా! మళ్ళీ వచ్చావు? చెట్టును ఎందుకు నరకబోతున్నావు? అని అడిగింది.

అప్పుడు కొండయ్య ఈ ఆవు వద్దు. ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చే ఉపాయం చెప్పు అన్నాడు. వన దేవత సరే అన్నది. ఆవును తీసుకొని ఒక బాతుని ఇచ్చింది. ఇది ప్రతీ రోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది. అమ్ముకొని సుఖముగా జీవించమని చెప్పింది. కొండయ్య బాతుతో ఇల్లు చేరాడు. బాతు ప్రతి రోజూ బంగారు గుడ్డు పెట్టేది. దాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో రోజులు గడిపేవాళ్ళు. కొన్ని రోజులకు కాంతమ్మకు మళ్ళీ విసుగు పుట్టింది. ఈ బాతు రోజుకు ఒక్క గుడ్డు మాత్రమే పెడుతుంది. మనం త్వరగా ధనవంతులం కావాలంటే కోరిన ధనం ఇచ్చే సంచి కావాలి. అది అడిగి తీసుకురా అని మళ్ళీ కొండయ్యను అడవికి పంపింది.

బాతుని తీసుకొని అడవికి వెళ్ళాడు. చెట్టు నరకబోయాడు. వనదేవత ప్రత్యక్షమయింది. ‘ఏం కొండయ్యా! మళ్ళీ వచ్చావు అంది. ఈ బాతు రోజుకు ఒక్క గుడ్దు మాత్రమే పెడుతుంది. మాకు ఇది వద్దు ధనం ఇచ్చే సంచి ఇవ్వు’ అన్నాడు. అతని అత్యాశకు వనదేవతకు కోపం వచ్చింది. బాతుతో పాటు మాయమైపోయింది.

కొండయ్యకు కోపం వచింది. బలంగా గొడ్డలితో చెట్టు కొమ్మ నరికాడు. అది తెగి కొండయ్య కాళ్ళపై పడింది. కాళ్ళు విరిగాయి. పడిపోయాడు. కాంతమ్మ కొండయ్యను వెతుక్కుంటూ అడవికి వచింది. ఎలాగో కొండయ్యను తీసుకొని ఇల్లు చేరింది. కొండయ్య పని చేయలేడు. ఎట్లా? కాంతమ్మే అడవికి వెళ్ళి ఉసిరి, నేరేడు, రేగు పండ్లు ఏరుకొని వచ్చేది. వాటిని తినేవారు. గింజలను ఇంటి వెనక ఖాళీ స్థలంలో విసిరే వారు. కొన్నాళకు అవి మొలకలెత్తి పెరిగి పెద్దవయ్యాయి. కాయలు కాసాయి. కాంతమ్మకు అడవికి వెళ్ళే భాధ తప్పింది. కావలసిన పండ్లు తాము తినేవారు. మిగిలినవి సంతలో అమ్మేవారు. చెట్లను కొట్టి బతకటమే కాకుండా చెట్లను పెంచి కూడా జీవితం సాగించవచ్చని కొండయ్య దంపతులు గ్రహించారు. ఇంటి ముందున్న ఖాళీ స్థలాన్ని కాంతమ్మ చదును చేసింది. రకరకాల పండ్ల మొక్కలు నాటింది. ప్రతి రోజు క్రమం తప్పకుండా నీరు పోసేది. ఒక రోజు వనదేవత ప్రత్యక్షమయింది. వాళ్ళు చేసే మంచి పని చూసింది సంతోషపడి దీవించింది. కొండయ్య దంపతులకు మొక్కలు పెంపకం విలువ తెలిసింది. తమ చుట్టు పట్ల మొక్కలు నాటటంలో నలుగురికి తోడ్పడ్డారు. ఆనందంగా జీవనం గడిపారు.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:ఆర్కైవ్ →
🎙️టుడేతెలుగు రేడియో · Live🎧టుడేతెలుగు పాడ్‌కాస్ట్‌లు📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📌స్టోరీ రిపోర్ట్✍️మా కోసం రాయండి📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్ఇంటర్వ్యూలుసినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీకంట్రిబ్యూటర్లురిపోర్టర్లుస్టోరీ రిపోర్ట్ప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి