🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
🕉️ సంస్కృతి›🧒 పిల్లల కార్నర్›📖 మూడు చేపలు
📖
నీతి కథలు

మూడు చేపలు

moodu cheepalu

⏱️ 13 నిమిషాల పఠనం

మంచిని ఎవరు చెప్పినా వినాలి. అలాకాక అజ్ఞానంతో, మూర్ఖత్వంతో ఆ మంచిమాటలను పెడచెవిన పెడితే అందుకు తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదు. ఇతరులందరూ అబద్దాలు చెప్పేవాళ్ళు అనుకుంటే అంతకు మించిన పొరపాటు మరొకటి లేదు. అలాంటి పొరపాటులు ఒక్కొక్కసారి ప్రాణాలకే ముప్పు తెస్తాయి అది ఎలాగో ఈ మూడు చేపల కధ ద్వారా తెలుసుకుందాం.

అంబాపురం సమీపంలో ఒక చిన్న చెరువు ఉంది. ఆ చెరువు నీటి గడ్డితోను నాచుతోను నిండి ఉండేది. ఆ చెరువులో ప్రభవ, విభవ, ఆశ్లేష అనే మూడు చేపలు ఎంతో స్నేహంగా ఉండేవి. ప్రభవ మంచి తెలివి కలది ఏ విషయం ఇతరులతో చెప్పించుకోకుండా ఇట్టే పసికట్టి సమయానికి తగ్గట్టుగా మసులుకునేది. విభవ కొంచెం మందబుద్ధి ఏవిషయం అయినా నిదానంగా ఆలోచించి నడుచుకునేది. ఆశ్లేష అహంకారి అన్నీ తనకే తెలుసునని మిగిలిన రెండు చేపలకంటే తానే తెలివైన దానినని విర్రవీగుతూండేది.

ఈ ముడు చేపల మధ్య గుణగణాలలో తేడాలు ఉన్నా ఒకే జాతికి చెందిన చేపలు కావటం వల్ల వాటి మధ్య స్నేహం ఏర్పడింది. ఒకనాడు కొందరు జాలరులు వచ్చి చెరువును పరిశీలిస్తూ మాట్లాడుకోవడం ప్రభవ విన్నది. వెంటనే తన మిత్రులైన విభవ, ఆశ్లేష దగ్గరకు వచ్చి 'మిత్రులారా! ఇప్పుడే ఇద్దరు జాలరులు మాట్లాడుకోవడం విన్నాను...' రెండు, మూడు రోజులలలో వచ్చి ఈ చెరువులో నీళ్ళు తోడి చేపలు పట్టుకుందాం అనుకుంటున్నారు. అందుకే మనం తొందరగా ఇక్కడికి దగ్గరలో ఉన్న మరో చెరువులోకి వెళ్ళిపోదాం ' అంటూ చెప్పింది. దాని మాటలకు ఆశ్లేష పగలబడి నవ్వి 'నువ్వు పిరికిపందవు' అంటూ ఎగతాళి చేసింది. విభవ మాత్రం 'ఇంకా రెండు మూడు రోజులు ఆగి కదా! అప్పుడు ఆలోచిద్దాం' అంది. ప్రభవ మాత్రం ఆ రాత్రికే వేరే చెరువుకు వలస వెళ్ళిపోయింది. రెండు రోజుల తరువాత వద్దామనుకున్న జాలరులు మర్నాడు ఉదయమే ఆ చెరువులో చేపలు పట్టుకునేందుకు వచ్చారు. చెరువులో కొంతభాగం బురుదమట్టితో గోడగా కట్టి ఇందులో నీళ్ళను తోడి అవతలకు పోసి ఆ తరువాత మిగిలిన కొద్దినీళ్ళల్లోకి వలలు వేసారు. దానితో చెరువులోని చేపలన్నీ వలలోకి చిక్కాయి.

'అయ్యో! మిత్రుడు చెప్పిన మాటలు వినకుండా ఈ జాలరులకు చిక్కామే' అంటూ విభవ, ఆశ్లేష భాధపడ్డాయి. ఆ సమయంలో విభవకు ఒక ఉపాయం తట్టింది. అది ఆశ్లేషకు చెబితే తనని ఎక్కడ ఎగతాళి చేస్తుందో అని చెప్పకుండా ఆ ఉపాయంతో తాను మాత్రమే జాలరుల నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకుంది. జాలరులు వలలోంచి ఒక్కొక్క చేపను తీసి బ్రతికున్నదా లేదా అని పరీక్షించి బుట్టలో వేసుకుంటున్నారు. అది గమనించిన విభవ జాలరి తనని వలలోంచి బయటకు తీసి పరీక్షిస్తున్నప్పుడు ఊపిరిబిగపట్టి చనిపోయినట్లు నటించింది. అది నిజంగా చచ్చిపోయింది అనుకున్న జాలరి దానిని చెరువు గట్టు మీదే వదిలేసి వెళ్ళిపోయాడు. జాలరి కనుమరుగు కాగానే విభవ మళ్ళీ చెరువులోని నీళ్ళలోకి గెంతి తన ప్రాణాలను కాపాడుకుంది. అహంకారంతోను, మూర్ఖత్వంతోను విర్రవీగిన ఆశ్లేష మాత్రం జాలరుల చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంది.

అందుకే పిల్లలు! మంచి మాటని ఎవరు చెప్పినా వినాలి. దాన్ని తప్పకుండా ఆచరించాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు పెద్దలకో... మనకంటే తెలివైన వారికో చెప్పి ఆ నిర్ణయం మంచిదో, చెడ్డదో తేల్చుకోవాలి.

📖 మరిన్ని నీతి కథలు

📖⏱️ 6 min
నమ్మకద్రోహం
nammakadroohm
📖⏱️ 7 min
చీమ-మిడత
cheema-midata
📖⏱️ 15 min
నిజం నిప్పులాంటిది!
nijm nippulaamtidi!
📖⏱️ 11 min
ఏనుగు బొమ్మ - కథ
eenugu bomma - katha
📖⏱️ 7 min
నిరుపయోగమైన విద్య
nirupayoogamaina vidya
📖⏱️ 7 min
సమయస్ఫూర్తి
samayasphoorti
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి