🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
🕉️ సంస్కృతి›🧒 పిల్లల కార్నర్›📖 ముసలి నక్క
📖
నీతి కథలు

ముసలి నక్క

musali nakka

⏱️ 7 నిమిషాల పఠనం

ఒక అడవిలో ఒక ముసలి నక్క ఉండేది. దానికి పళ్లన్నీ ఊడిపోయాయి. అది ఆహారం కోసం వెదుకుతుండగా, ఏనుగు మృతదేహం దాని కంటపడింది. ఆ చనిపోయిన ఏనుగు పక్కన కూర్చుని దానికి కాపలా కాస్తున్నట్లు నటించి ఏదైనా జంతువు వస్తే దానితో ఏనుగు చర్మాన్ని కొరికించి, ముక్కలు చేయించి మాంసం తినాలని అనుకుంది.

అప్పుడే అటుగా వస్తున్న సింహంతో "మృగరాజా! నేను ఈ ఏనుగుకు కాపలా ఉన్నాను. కావాలనుకుంటే ఈ ఏనుగు మాంసాన్ని తినవచ్చు" అని చెప్పింది నక్క. "నేను చనిపోయిన జంతువులను తినను" అని తన దారిన తాను వెళ్లింది సింహం.

మరికొద్ది సేపటికి ఒక పులి అటుగా రావడంతో "పులిరాజా! ఈ ఏనుగును ఆరగిస్తారా?" అంది నక్క. "నేను ఏనుగుల మాంసాన్ని ఇష్టపడను" అనుకుంటూ వెళ్లిపోయింది పులి.

పులి వెళ్లీ వెళ్లగానే అటు వైపు వచ్చింది ఒక కోతి. కోతిని చూసిన నక్క ఈ సారి ఎలాగైనా తాననుకున్నది సాధించాలని, "ఇప్పుడే ఒక సింహం ఈ ఏనుగుని చూసి నన్నిక్కడ కాపలా పెట్టి వెళ్లింది. నీకు తినాలనిపిస్తే ఈ ఏనుగును తిను, నేను సింహం వస్తూ ఉంటే నీకు సైగ చేస్తాను" అని నక్క చెప్పింది కోతితో. కోతి ఏనుగు మృతదేహంపై ఎక్కి తన వాడియైన పళ్లతో ఏనుగు చర్మాన్ని ముక్కలుగా చించేసింది. అప్పుడే నక్క "మిత్రమా పారిపో సింహం వచ్చేసింది" అని అరవగానే కోతి ప్రాణభయంతో కనబడకుండా పారిపోయింది. ఇక తినడమే ఆలస్యమని ఏనుగు శరీరం మీదికెక్కిన నక్కకు "మిత్రమా! పారిపో" అంటూ ఒక అరుపు వినిపించింది. ఒక బలమైన నక్క అటుగా పరుగెత్తుకువచ్చి ఏనుగు మాంసాన్ని తినసాగింది. రెండు నక్కల మధ్య పోరు జరిగినా ముసలినక్క బలమైన నక్క దెబ్బలకు భరించలేక" నాకు కూడా ఏనుగు మాంసమంటే ఇష్టంలేదు" అని అక్కడి నుంచి పారిపోయింది.

📖 మరిన్ని నీతి కథలు

📖⏱️ 6 min
నమ్మకద్రోహం
nammakadroohm
📖⏱️ 7 min
చీమ-మిడత
cheema-midata
📖⏱️ 15 min
నిజం నిప్పులాంటిది!
nijm nippulaamtidi!
📖⏱️ 11 min
ఏనుగు బొమ్మ - కథ
eenugu bomma - katha
📖⏱️ 7 min
నిరుపయోగమైన విద్య
nirupayoogamaina vidya
📖⏱️ 7 min
సమయస్ఫూర్తి
samayasphoorti
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Advertisement
Sponsored by TTA – Telangana American Telugu Association
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి