🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
🕉️ సంస్కృతి›🧒 పిల్లల కార్నర్›📖 నారాయణ సాయం
📖
నీతి కథలు

నారాయణ సాయం

naaraayana saaym

⏱️ 10 నిమిషాల పఠనం

రంగాపురం అనే గ్రామంలో నారాయణ అతి పెద్ద భూస్వామి, కాని పరమ పిసినారి. పిల్లికి కుడా బిచ్చం పెట్టడని అందరూ అనుకుంటారు. నారాయణ ఇంటి పక్కనే ఉండే ఒక పూరిపాకలో లక్ష్మి అనే అమ్మాయి తన తల్లితో పాటు నివాసం ఉండేది. వాళ్ళు చాలా పేద వాళ్ళు. ఒకసారి లక్ష్మి తల్లికి విపరీతమైన జబ్బు చేసింది. అక్కడా, ఇక్కడా పాచి పనిచేస్తూ ఆకలి తీర్చే తల్లే మంచాన పడడంతో పట్టుమని పన్నెండేళ్లు లేని లక్ష్మికి ఏం చేయాలో పాలుపోలేదు. తన తల్లిని ఎలాగైనా బతికించుకోవాలని అనుకుంది.

తమ పాక పక్కన గల భవంతిలో నివాసముండే నారాయణ ఒక్కడే దిక్కనుకుంది లక్ష్మి. అతని దగ్గరికెళ్ళి "అయ్యా! మా అమ్మ మంచాన పడింది. వైద్యం చేయించకపోతే పరిస్ధితి వికటిస్తుంది. మాకు రోజు గడవడమే చాలా కష్టంగా ఉంది. వైద్యం ఎలా చేయించేది? మీరు దయచేసి కాస్త డబ్బు సహాయం చేస్తే మా అమ్మకు వైద్యం చేయిస్తాను" అని బతిమిలాడింది. కనికరమేలేని నారాయణ "ఛీ పో!" అంటూ ఛీత్కరించుకున్నాడు. అక్కడే ఉన్న సురయ్య అనే కూలీ ఇదంతా గమనించాడు. లక్ష్మి ఆవేదనను చూసి కరిగిపోయిన సూరయ్య ఆమెకు ఎలాగైనా సహాయం చేయాలనుకున్నాడు.

లక్ష్మి చేసేదేమీ లేక మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి పాడుబడిన దేవాలయంలో కూర్చుంది. దేవుడి ముందు మోకరిల్లి తన గోడును వినిపించింది. "ఎలాగైనా నువ్వే సహాయం చేయాలి," అంటూ వేడుకుంది. దేవాలయంలో నుంచి బయటకు వస్తుండగా గర్భగుడిలో నుంచి ఒక గొంతు వినిపించింది. "అమ్మా లక్ష్మి! నీ గోడు విన్నాను. ఇక్కడ నీ కోసం కొంత డబ్బు పెట్టాను, తీసుకెళ్ళి మీ అమ్మకు వైద్యం చేయించు" అని పలికిందా గొంతు. అది విన్న లక్ష్మి సంతోషంగా వెనక్కి వచ్చి డబ్బు తీసుకుని అక్కడ ఎవరూ కనబడకపోయేసరికి "ఎవరు మీరు?" అని ప్రశ్నించింది. "నేను ఇప్పటి వరకు నీ బాధను విన్న దేవుడిని" అని సమాధానం వచ్చింది. "వెళ్ళు త్వరగా వెళ్ళి మీ అమ్మ వైద్యం సంగతి చూడు" అని మళ్ళీ పలికిందా గొంతు.

ఏమీ ఆలోచించకుండా డబ్బులు తీసుకుని వెళ్ళి తన తల్లికి వైద్యం చేయించింది లక్ష్మి. లక్ష్మికి దేవుడు డబ్బు ఇచ్చాడన్న సంగతి ఊరంతా తెలిసి నారాయణ చెవిలో కూడా పడింది. అతను "అవునా" అన్నట్టుగా ఊరుకున్నాడు.

సహాయం చేయగల స్తోమత ఉండీ లక్ష్మిని ఆదుకోని నారాయణ సిరిసంపదలు, చాలీచాలని జీవితంలో నారాయణ వద్ద పనిచేస్తున్న సూరయ్య మంచి వ్యక్తిత్వం ముందు దిగదుడుపే కదా!

సూరయ్య లాగ సహాయం చేసి కూడా పేరు బయటపెట్టుకోని వాళ్ళు మహనీయులు.

📖 మరిన్ని నీతి కథలు

📖⏱️ 6 min
నమ్మకద్రోహం
nammakadroohm
📖⏱️ 7 min
చీమ-మిడత
cheema-midata
📖⏱️ 15 min
నిజం నిప్పులాంటిది!
nijm nippulaamtidi!
📖⏱️ 11 min
ఏనుగు బొమ్మ - కథ
eenugu bomma - katha
📖⏱️ 7 min
నిరుపయోగమైన విద్య
nirupayoogamaina vidya
📖⏱️ 7 min
సమయస్ఫూర్తి
samayasphoorti
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Advertisement
Sponsored by TTA – Telangana American Telugu Association
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి