🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
🕉️ సంస్కృతి›🧒 పిల్లల కార్నర్›📖 నోరుమూయించడం
📖
నీతి కథలు

నోరుమూయించడం

noorumooyimchadm

⏱️ 10 నిమిషాల పఠనం

వారణాసిని బ్రహ్మదత్తుడు పరిపాలిస్తున్నాడు. బోధిసత్వుడతనికి మంత్రిగా ఉండేవాడు. రాజపురోహితుడు వట్టి వాగుడుకాయ. అతను ఇంకొకరికి మాట్లాడే అవకాశమే యివ్వకుండా పటపటవాగుతూ డబ్బా కొట్టేవాడు. అది రాజుకీ ఇతరులకీ కూడా దుర్భరంగా ఉండేది. అతని నోరు ఎవరు మూయించగలరా అని ఎదురుచూస్తున్నాడు రాజు.

ఆ కాలంలోనే వారణాసిలో ఒక కుంటివాడుండేవాడు. కాళ్ళు వంకరయినా రాళ్ళు విసరడంలో బహునేర్పరి. పిల్లలు తనిని బండిలో కూర్చోబెట్టి ఊరి చివర నగరద్వారం వద్దకు తీసుకుపోయేవారు. అక్కడొక పెద్దమర్రిచెట్టుండేది. పిల్లలు వాడికి డబ్బులిచ్చి మర్రి ఆకులను మట్టివుండలతో కొట్టి ఆ ఆకులలో ఏనుగు బొమ్మో, గుర్రం బొమ్మో తెప్పించమనేవారు. కుంటివాడు గులకరాళ్ళు విసిరి మర్రిఆకు చెట్టుమీదుండగానే ఆకారం తెప్పించి అప్పుడు దానిని రాలగొట్టేవాడు. అది పిల్లలకు ఆట. అలా రాల్చిన ఆకులు నేలమీద గుట్టగా పడివుండేవి.

ఒకరోజు రాజు ఉద్యాన వనానికి పోతూ ఆ ఆకులగుట్టని చూసి 'వీటినిలా కోసిన వారెవరు?' అని అడిగారు. పిల్లలు కుంటివాడిని ఒంటరిని చేసి పారిపోగా కుంటివాడు 'నేనే మహారాజా' అంటూ విషయమంతా వివరించాడు. రాజు పరివారాన్ని దూరంగా పంపి ఆ కుంటివాడిని 'ఏమయ్యా! మావద్ద ఒక వదరబోతున్నాడు. నీ విద్యతో అతని నోరుకట్టించగలవా?' అని అడిగాడు. తప్పకుండా అన్నాడు కుంటివాడు.

రాజు తనిని తన భవనానికి తీసుకొనిపోయి గది మధ్యగా తెర అడ్డం కట్టించి తెరకు చిన్న రంధ్రం చేయించి చిల్లుకి దురుగా పురోహితుడి ఆసనం వేయించి ఆయనవచ్చి కూర్చోగానే మాటలు మొదలు పెట్టాడు. అలవాటుప్రకారం పురోహితుడు తెరిచిన నోరు మూయకుండా మాట్లాడెయ్యడం మొదలు పెట్టాడు. తెర ఇవతల కుంటివాడు మేకపెంటికలను గొట్టంలోంచి తెరలోని చిల్లు ద్వారా పురోహితుడు తెరిచిన నోటిలోకి గురిచూసి కొట్టసాగాడు తన గొట్టంతో. పురోహితుడు మాట్లాడడంలో మునిగిపోయి వాటిని మింగేయసాగాడు. అలా చాలా మేక పెంటికలని తెరలోని కన్నం ద్వారా తన గొట్టంతో అతని నోటిలోనికి గురిచూసి పంపాడు కుంటివాడు. పురోహితుడి కడుపులోకి పోయిన మేకపెంటికలు ఉబ్బిపోయి అతనికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. అప్పుడు రాజు అయ్యా! మీరు వాక్‌ప్రవాహంలో మునిగిపోయి నోటిలోకి మేక పెంటికలు పోవడం గమనించలేదు. ఇప్పుడవి కడుపులో ఉబ్బి బాధిస్తున్నాయి. ఇంటికి వెళ్ళి వాంతికి సాధనం చెయ్యండి, సర్దుకోండి. అని పంపేశాడు. అప్పటి నుంచి పురోహితుడు నోరు తెరిస్తే ఒట్టు. రాజుకి యితరులకీ సుఖంగా ఉంది. రాజు కుంటివాడికి సంవత్సరానికి లక్షరూపాయల ఆదాయం ఇచ్చాడు. ఎదుటివారి పరిస్థితిని ఇబ్బందిని కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి.

📖 మరిన్ని నీతి కథలు

📖⏱️ 6 min
నమ్మకద్రోహం
nammakadroohm
📖⏱️ 7 min
చీమ-మిడత
cheema-midata
📖⏱️ 15 min
నిజం నిప్పులాంటిది!
nijm nippulaamtidi!
📖⏱️ 11 min
ఏనుగు బొమ్మ - కథ
eenugu bomma - katha
📖⏱️ 7 min
నిరుపయోగమైన విద్య
nirupayoogamaina vidya
📖⏱️ 7 min
సమయస్ఫూర్తి
samayasphoorti
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి