బంగ్లాదేశ్‌లో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్‌తో సంబంధాలు కొత్త గంగా జలాల పంపిణీ ఒప్పందంపై ఆధారపడి ఉంటాయని అధికార బీఎన్‌పీ పార్టీ స్పష్టం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇండో-బంగ్లాదేశ్ గంగా జలాల ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్‌తో ముగియనుంది.
ఈ నేపథ్యంలో ఢాకాలో జరిగిన కార్యక్రమంలో బీఎన్‌పీ ప్రధాన కార్యదర్శి మిర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ ప్రజల అవసరాలు, అంచనాలకు అనుగుణంగా కొత్త ఒప్పందం వెంటనే కుదుర్చాలని భారత్‌కు స్పష్టమైన సందేశం పంపుతున్నామని తెలిపారు. షేక్ హసీనా ప్రభుత్వ కాలంలో కుదిరిన ప్రస్తుత ఒప్పందం పునరుద్ధరణపై అనిశ్చితి నెలకొనడంతో భవిష్యత్ నీటి పంపిణీపై ఆందోళనలు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.















