అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన వైట్ హౌస్ బాల్‌రూమ్ ప్రాజెక్ట్‌పై మరోసారి వివాదం చెలరేగింది. 90 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ భారీ బాల్‌రూమ్‌లో అత్యాధునిక హాస్పిటల్, మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తామని వైట్ హౌస్ వెల్లడించింది. 400 మిలియన్ డాలర్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్‌ను అమెరికా ప్రజలకు బహుమతిగా అందిస్తున్నామని యాక్టింగ్ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్ కోర్టులో వాదించారు.
అయితే చారిత్రక వైట్ హౌస్ నిర్మాణాన్ని దెబ్బతీస్తున్నారని హెరిటేజ్ సంరక్షణ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రాజెక్ట్ కోసం ఈస్ట్ వింగ్‌ను ముందస్తు అనుమతులు లేకుండానే కూల్చివేయడంతో కేసు కోర్టుకు చేరింది. ప్రస్తుతం నిర్మాణ పనులను ఫెడరల్ జడ్జి తాత్కాలికంగా నిలిపివేయగా, జూన్ 5న అప్పీల్ కోర్టులో విచారణ జరగనుంది.














