ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. గతంలో నిలిచిపోయిన నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమై, ఇప్పుడు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మిస్తున్న విల్లాలు తుది దశకు చేరుకోవడం విశేషం. ఈ నివాస భవనాల్లో అంతర్గత ఇంటియర్ పనులు కూడా వేగంగా పూర్తవుతూ, త్వరలోనే వినియోగానికి సిద్ధమవుతున్నాయి. జడ్జిల కోసం నిర్మిస్తున్న క్వార్టర్స్ కూడా అందంగా ముస్తాబవుతున్నాయి.