Delhi Capitals : ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఘోర ఓటమిపై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ స్పందించారు. పంజాబ్ చేతిలో ఓటమి ప్రభావం తమపై ఉందని, తదుపరి మ్యాచ్‌ల్లో పుంజుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఓటమి ఎదురైనా టీమ్‌లో పెద్దగా మార్పులు ఉండవని కెప్టెన్ తెలిపారు.