పూజా కార్యక్రమాల్లో మనం రకరకాల పూలను ఉపయోగిస్తుంటాం. అయితే, బంతి పూలకు ఆధ్యాత్మికంగా, జ్యోతిష్య పరంగా ఒక ప్రత్యేక స్థానం ఉంది. పసుపు, కేసరి రంగుల్లో వికసించే ఈ పూలు ఇంటికి అదృష్టాన్ని తీసుకువస్తాయని మీకు తెలుసా..? అవును, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పసుపు రంగు బృహస్పతి గ్రహానికి (గురువు) సంబంధించినది. బంతి పూలను పూజలో వాడటం వల్ల జాతకంలో గురు గ్రహం బలోపేతం అవుతుంది. ఇది వ్యక్తికి గౌరవాన్ని, జ్ఞానాన్ని, స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది.