తెలంగాణలో వానలు.. ఆంధ్రప్రదేశ్‌లో సెగలు.. రాగల మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఒకవైపు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణను పలకరించనుండగా.. రాయలసీమలో ఉష్ణోగ్రతలు ఏకంగా 44 డిగ్రీలకు చేరువవుతున్నాయి.