తిరుపతి జిల్లా అనంతరాజుపేట వద్ద హుబ్లీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌పై ప్రయాణికులకు భయానక అనుభవం ఎదురైంది. రాత్రివేళ రైలు బోగీపై మంటలు చెలరేగగా, తనిఖీ చేయగా కాలిపోయిన మృతదేహం బయటపడింది. హైటెన్షన్ విద్యుత్ తీగలు తగలడం వల్లే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని ప్రాథమిక నిర్ధారణ. ఆ వ్యక్తి రైలుపైకి ఎలా చేరాడనేది మిస్టరీగా మారింది. ఈ ఘటన రైల్వే భద్రతపై తీవ్ర ప్రశ్నలు రేకెత్తిస్తోంది.