Hardik Pandya comments: ఐపీఎల్ 2026 సీజన్ ముంబై ఇండియన్స్‌కు పీడకలలా మారుతోంది. చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ప్రతిష్టాత్మక పోరులో ముంబై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో ప్లేఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఓటమికి గల కారణాలను విశ్లేషించారు.