కుంభమేళా స్టార్ మోనాలిసా మరోసారి వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా సహా నలుగురిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేరళలో పోక్సో కేసు నమోదైంది. 'ది డైరీ ఆఫ్ మణిపూర్' సినిమా షూటింగ్ సమయంలో ఈ ఘటనలు జరిగాయని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కోర్టులో వాంగ్మూలం నమోదు చేయగా, కేసు మధ్యప్రదేశ్‌కు బదిలీ అయ్యే అవకాశం ఉంది.