టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది. ఇదివరకే థియేటర్లలో సందడి చేయాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన మేకర్స్.. ఇప్పుడు తాజాగా కొత్త డేట్ అనౌన్స్ చేశారు.