ఇంట్లోనో, ఆఫీసులోనో ఫోన్ ఎక్కడో పెడతాం.. తీరా కాల్ చేస్తే అది సైలెంట్ లేదా వైబ్రేట్ మోడ్‌లో ఉంటుంది. చుట్టుపక్కల ఎన్నిసార్లు వెతికినా దొరకదు. ఇలాంటి సందర్భాల్లో మీ ఆందోళనను దూరం చేసే అద్భుతమైన ఫీచర్లు ఆండ్రాయిడ్, ఐఫోన్లలో ఉన్నాయి. మీ ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నా సరే, అది పెద్దగా రింగ్ అయ్యేలా చేసే ట్రిక్స్ ఇవే..