Sunrisers Hyderabad vs Kolkata Knight Riders: ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న 45వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు చేతులెత్తేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్‌ఆర్‌హెచ్, కేకేఆర్ బౌలర్ల ధాటికి 19 ఓవర్లలోనే 165 పరుగులకు ఆలౌట్ అయింది. భారీ స్కోరు సాధిస్తుందనుకున్న తరుణంలో వరుస వికెట్లు కోల్పోయి అభిమానులను నిరాశకు గురిచేసింది.