రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కోసం యుద్ధం నడుస్తోంది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు, చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులే దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న ఒకట్రెండు బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో రణరంగంలా మారుతోంది.