కేరళలోని తిరువనంతపురంలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. పాము కాటుకు గురై ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఇంట్లోకి దూరిన ఓ నాగు పాము గాడ నిద్రలో ఉన్న 8 ఏళ్ల చిన్నారిని కాటేసింది. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని హాస్పిటల్‌కు తరలించినప్పటికి చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.