నవతెలంగాణ – జుక్కల్మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ మండలానికి చెందిన అన్ని శాఖల అధికారులతో పాటు గ్రామ పంచాయతీ సర్పంచులతో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు ప్రక్రియలో భాగంగా ఆన్లైన్ సర్వే కారణంగా లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సవివరంగా చర్చించడం జరిగింది. పెండింగ్లో ఉన్న సర్వేలను తక్షణమే పూర్తి చేసి, అర్హులైన ప్రతీ లబ్ధిదారునికి ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. […]
The post సర్పంచులు, అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం appeared first on Navatelangana.

