Vaibhav Suryavanshi : కేవలం 37 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 భారీ సిక్సర్లతో 103 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో వైభవ్ ఒక్కసారిగా కుంటుతూ కనిపించాడు. హ్యామ్‌స్ట్రింగ్ సమస్య తలెత్తడంతో ఫిజియోలు మైదానంలోనే అతనికి చికిత్స అందించారు.