ఢిల్లీలోని ఫోర్టిస్ హాస్పిటల్ షాలిమార్ బాగ్‌ వైద్యులు అరుదైన ఎముక క్యాన్సర్‌ అయిన స్టేజ్-3 ఈవింగ్‌ సార్కోమాతో బాధపడుతున్న 17 ఏళ్ల బాలికకు విజయవంతంగా చికిత్స అందించారు. ఏడాదికి పైగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వెన్నుపైన వాపుతో బాధపడుతున్న ఆమె మొదట ఇతర చికిత్సలు తీసుకున్నా ప్రయోజనం లేకపోవడంతో వ్యాధి ముదిరింది.

పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్చగా, ఆమెకు సెప్టిక్ షాక్‌, రక్తంలో ఆక్సిజన్ తీవ్రంగా తగ్గిపోవడం, రక్తపోటు ప్రమాదకర స్థాయిలో పడిపోవడం వంటి సమస్యలు కనిపించాయి. వెంటనే ఐసీయూలో వెంటిలేటర్‌ సహాయంతో చికిత్స ప్రారంభించిన వైద్య బృందం, కీమోథెరపీతో పాటు మల్టీడిసిప్లినరీ ట్రీట్‌మెంట్‌ అందించి ప్రాణాలను కాపాడింది.