కేరళ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది..! వి డి సతీశన్ ముఖ్యమంత్రి పదవికి చేరువవుతున్న వేళ, ఆయన ప్రభుత్వంపై ఐయూఎంఎల్‌, జమాత్-ఏ-ఇస్లామీ ప్రభావం ఉంటుందా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మరోవైపు ఎన్‌ఎస్‌ఎస్‌ కూడా ఈ ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “ముస్లిం లీగ్ ఒత్తిడికే సతీశన్ ఎంపిక జరిగిందా..?” అంటూ పరోక్ష విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో ముస్లిం లీగ్ జోక్యం పెరిగిందనే ఆరోపణలు ఇప్పుడు కేరళ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి..!