భారత ఎన్నికల సంఘం (ECI) దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (Special Intensive Revision - SIR) మూడో దశ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ దశలో 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల జాబితాల సవరణ చేపట్టనున్నారు.

జనగణన (Census) గృహ గణన ప్రక్రియలో పనిచేస్తున్న ఫీల్డ్ సిబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఈ షెడ్యూల్ రూపొందించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

తాజా ప్రకటనతో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు SIR పరిధిలోకి వచ్చాయి. అయితే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాలకు సంబంధించిన షెడ్యూల్‌ను తరువాత ప్రకటిస్తామని ఈసీఐ వెల్లడించింది. మంచు ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మరియు జనగణన రెండో దశ పూర్తయ్యాక ఆ నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.

భారీ స్థాయిలో చేపడుతున్న ఈ ఓటరు ధృవీకరణ కార్యక్రమంలో భాగంగా 3.94 లక్షలకు పైగా బూత్ లెవల్ అధికారులు (BLOలు) ఇంటింటికీ వెళ్లి 36.73 కోట్ల మంది ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు.