
నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరీర్ 111వ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా తాజాగా మొదలైంది. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది సస్పెన్స్ గా మారింది. మొదట కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఈ సినిమా కోసం ఫిక్స్ అయ్యింది కానీ తర్వాత మరో స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పేరు కూడా వచ్చింది. ఇప్పుడు ఫైనల్ గా మేకర్స్ కాజల్ తోనే ముందుకు వెళుతున్నట్టు తెలిసింది. కాజల్ తో మొదటి షెడ్యూల్ కూడా ఇప్పుడు మొదలు కానుండగా ఆమె ఈ షెడ్యూల్ కోసం ఈ నెల మొత్తం కేటాయించిదట.గతంలో ’భగవంత్ కేసరి’లో బాలయ్యతో కలిసి నటించిన కాజల్, మరోసారి ఆయన సరసన నటిస్తోంది.












