
హైదరాబాద్: మే 3వ తేదీన జరిగిన నీట్ 2026 పరీక్షను రద్దు చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో క్వశ్చన్ పేపర్ లీక్ కావడంతోనే నీట్ పరీక్షను రద్దు చేసినట్లు సమాచారం. ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు నీట్ ఎగ్జామ్ కు 48 గంటల ముందు విద్యార్థులకు ఇచ్చిన ప్రాక్టీస్ పేపర్ లోని ప్రశ్నల్లో దాదాపు 600 మార్కుల ప్రశ్నలు ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ లో ఉన్నట్లు గుర్తించారు. ఈ అంశం మీద సిబిఐ విచారణ జరిపిస్తామని, కేంద్రం తదుపరి ఆదేశాలు ఇచ్చిన తరువాత ఎలాంటి ఫీజు లేకుండా మరోసారి నీట్ పరీక్ష నిర్వహిస్తామని ఎన్ టిఎ తెలిపింది. నీట్ పరీక్ష రద్దుతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతారని తెలిసినా కూడా రాజీపడితేనే ఈ వ్యవస్థకు దీర్ఘకాలిక నష్టం జరగదని ఎన్టిఎ తెలిపింది. త్వరలోనే రీఎగ్జామ్ నిర్వహిస్తామని ప్రకటించింది. విద్యార్థులు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని పరీక్షా కేంద్రాల్లోనూ మార్పు ఉండదని స్పష్టం చేసింది. అదనంగా ఫీజు కట్టాల్సిన అవసరం లేదని, చెల్లించిన ఫీజును కూడా రీఫండ్ చేస్తామని ఎన్టిఎ తెలియజేసింది. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, త్వరలో కొత్త అడ్మిట్ కార్డులను ఇస్తామని తెలిపింది.














