తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో “ఆచార్య జయశంకర్ బడిబాట” కార్యక్రమాన్ని కాటేపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఎంఈఓ ప్రవీణ్ కుమార్ ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యక్రమం మూడవ రోజు గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరించినట్లు తెలిపారు. ప్రతి తల్లి, తండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్, యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం, అలాగే పోషకాహారంగా రాగి జావా అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు ఏఐ (Artificial Intelligence) విద్యను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.