తెలంగాణ రాష్ట్ర పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. తాజా టెన్త్ ఫలితాల్లో మొత్తం 95.15% ఉత్తర్లత సాదించగా ఇందులో బాలికలదే పైచేయిగా నిలిచింది. బాలికల ఉత్తీర్ణత 96.26 శాతంగా ఉంది. ఇక బాలుర ఉత్తీర్ణత 94.07 శాతంగా నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 5,731 సూళ్లు వందశాతం ఉత్తీర్ణతతో సత్తా చాటాయి.
అయితే ఆరు పాఠశాలలో ఒక్కరూ పాస్ కాలేదు. అవన్నీ ప్రైవేట్ స్కూళ్లు కావటం గమనార్హం. తద్వారా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు కంటే మెరుగ్గా రాణించాయని అర్ధం అవుతుంది.












