హైదరాబాద్: బిఆర్ఎస్ నేతలు కెటిఆర్, హరీశ్ రావులపై ఎఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా వేసినట్లు తెలిపారు. తనపై, కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. జన్వాడ ఫాంహౌస్‌లో కట్టుకథలు రచించారన్నారు. కాంట్రాక్టర్‌ దగ్గర తాను రూ.8 కోట్లు అడిగినట్లు అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. బిఆర్ఎస్ ఇటువంటి రాజకీయాలు మానుకోవాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.