
హీరో రోహిత్ నారా తన తదుపరి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. కరణ్.సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పితో కలిసి ఆయన చేస్తున్న ఈ కొత్త చిత్రం బ్యానర్‌కి ప్రొడక్షన్ నెం.5గా రూపొందుతోంది. ‘ఆర్ఎన్23’ ఫీల్‌గుడ్ రొమాంటిక్ కామెడీగా, ఆకట్టుకునే కుటుంబ భావోద్వేగాలతో ప్రేక్షకులను అలరించనుంది. భరత్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ చినిమిల్లి మణికుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముహూర్తపు షాట్‌కు కొరటాల శివ క్లాప్ కొట్టి, మేకర్స్ కు స్క్రిప్ట్‌ను అందజేసి చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫస్ట్ షాట్‌ను డైరెక్ట్ చేయగా, సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాస్ రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. క్రేజీ హీరోయిన్ నయన్ సారిక ఈ చిత్రంలో రోహిత్ నారాకు జోడీగా నటిస్తోంది. అలాగే నరేష్ వికె, రోహిణి, సంపత్, అజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునేలా హాస్యం, ప్రేమ, భావోద్వేగాలతో ‘ఆర్ఎన్23’ రూపొందుతోంది. మూవీ లాంచింగ్ ఈవెంట్లో డైరెక్టర్ చినిమిల్లి మణికుమార్ మాట్లాడుతూ “ఇది చాలా మంచి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. జూన్ 10 నుంచి ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభిస్తున్నాం. షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి ఈ ఏడాదిలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం”అని తెలిపారు.













