
మర్చిపోయిన బంగారు ఆభరణాలు పోలీసులకు అప్పగింత
మనతెలంగాణ, సిటిబ్యూరో: ఆటో డ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు, ఆటో ప్రయాణికులు మర్చిపోయిన బంగారు ఆభరణాలను పోలీసులకు అప్పగించాడు. పోలీసుల కథనం ప్రకారం...కర్నాటక రాష్ట్రం, గుల్బర్గాకు చెందిన సుజాత ఆర్ హిరేమఠ్ గురువారం నార్సింగి నుంచి బిర్లామందిర్ వరకు ఉబెర్ ఆటోలో ప్రయాణించారు. బిర్లా మందిర్ వద్ద 6.5తులాల బంగారు ఆభరణాలు, రూ.3,500 నగదు ఉన్న బ్యాగును ఆటోలోనే మర్చిపోయారు. తర్వాత గుర్తించినా అప్పటికే ఆటో డ్రైవర్ వెళ్లి పోవడంతో సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు ఆటో నంబర్‌ను గుర్తించి ఫోన్ చేశారు. చింతల్ బస్తీకి చెందిన కె.నగేష్ పోలీసులు ఫోన్ చేయడంతో బ్యాగు తన ఆటోలోనే ఉందని తెలిపారు. వెంటనే సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆటోడ్రైవర్ నగేష్ నగదు, బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగులను అందించారు. బ్యాగును ఇన్స్‌స్పెక్టర్ సీతయ్య బాధితులకు అందజేశారు. ఆటోడ్రైవర్ నిజాయితీని మెచ్చిన ఇన్స్‌స్పెక్టర్ నగదు బహుమతిని అందజేశారు.











