
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ ఆరంభంలో వరుసగా 6 మ్యాచ్‌లు ఓడిన కెకెఆర్.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచులు గెలిచి మంచి జోరు మీద ఉంది. ఈ మ్యాచ్‌పై కూడా కెకెఆర్ కన్నేసింది. మరోవైపు ఢిల్లీ.. చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది.
తుది జట్లు:
డిసి: పాతుమ్ నిస్సాంకా, కెఎల్ రాహుల్(కీపర్), నితీశ్ రాణా, సమీర్ రిజ్వి, ట్రిస్టన్ స్టబ్స్. అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, లుంగి ఎంగిడి, ముఖేశ్ కుమార్.
కెకెఆర్: అజింక్యా రహానే(కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ(కీపర్), కామరూన్ గ్రీన్, రొవ్‌మెన్ పొవెల్, మనీశ్ పాండే, రింకూ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, కార్తీక్ త్యాగీ, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.














