స్విమ్మింగ్ ఫూల్‌లో ఈత కోడుదామని ప్రమాద వశాత్తు దూకి ఓ యువతి మృతి చెందిన సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో లింగోజిగూడ డివిజన్ న్యూశివపురి కాలనీలో నివాసం ఉండే దేవేందర్‌రెడ్డి ,సునీతా దంపతులు కూమారై వీణ(28) అమెరికా వర్జీనియాలో నివాసం ఉంటుంది. వీణ ఓక విందు నిమిత్తం రెండు రోజుల క్రితం ఫ్లోరిడాకు వెళ్లింది, అక్కడ స్విమ్మింగ్ ఫూల్‌లో జరిగిన ఘటనలో యువతి మృతి చెందింది.

ఈ విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎంఎల్ఎ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి వారి నివాసానికి తరలివెళి ,వీణ తల్లి దండ్రులకు ధైర్యం చెప్పారు. ఈసంధర్బంగా ఎంఎల్ఎ మాట్లాడుతూ.... వీణ బౌతిక కాయాన్ని త్వరలో ఇండియాకు రప్పించేందుకు తన వంతు సహాయ సహాకారాలు అందజేస్తానని తెలిపారు. మాజీ కార్పోరేటర్ వీణ కుటుంబ సభ్యులను పరామర్శించి ,ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడి వీణ బౌతిక కాయాన్ని నగరానికి తెప్పించేందుకు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు.