అమ్మే మంచిదిరాఅని చెప్పిన నాన్నఅమ్మను ఒంటరి చేసిముందే వెళ్లిపోయాడుఅమ్మ పిచ్చిదిరాఅని జాలిపడ్డ నాన్నఅమ్మను నిజంగానేపిచ్చిదాన్ని చేసిముందే వెళ్లిపోయాడుఅమ్మకు పుణ్యస్త్రీత్వంబహుమతిగాలభించాలనుకున్న నాన్నఅమ్మకు వైధవ్యాన్ని కానుకిచ్చిముందే వెళ్లిపోయాడుమా అందరికీఅమ్మే ధైర్యమని చెప్పిన నాన్నమా అమ్మకు మాత్రంతనే ధైర్యమన్న సంగతి మరిచివెళ్లిపోయాడు!– చిత్తలూరి, 9133832246

The post అమ్మే ధైర్యం ! appeared first on Navatelangana.