
డిఫరెంట్ ఎంటర్‌టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్... రైటర్-, డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ’గాయపడ్డ సింహం’తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో హీరో శ్రీవిష్ణు స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ‘గాయపడ్డ సింహం’ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ వీసా స్టాంపింగ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ “డైరెక్టర్ కశ్యప్‌కి ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ ఉంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది”అని అన్నారు. డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ మాట్లాడుతూ “జేడీ, తరుణ్ ఇచ్చిన సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. శ్రీ విష్ణు ఈ సినిమాలో భాగం కావడం మా అదృష్టంగా భావిస్తున్నాను. అందరినీ అలరించే సినిమా ఇది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారా రోహిత్, జేడీ చక్రవర్తి, ఫారియా అబ్దుల్లా, మానస చౌదరి, పవన్ సాదినేని, స్వీకర్ అగస్తి, శ్రీరామ్ ఆదిత్య, సాయి మార్తాండ, హుస్సేన్ షా కిరణ్, హసిత్ గోలి, సందీప్ రాజ్, సందీప్, భాను కిరణ్, దివ్య పాల్గొన్నారు.









