నవతెలంగాణ – హైదరాబాద్ : మెదక్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జగదేవపూర్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నర్సయ్య.. తన భార్య జయలక్ష్మిపై ఇనుప రాడుతో దాడి చేశాడు. శుక్రవారం బాధితురాలు మేనత్త ఇంట్లో ఉండగా ఈ ఘటన జరిగింది. అనుమానంతో తరచూ వేధింపులకు పాల్పడుతున్న నర్సయ్య, భార్య తలపై దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
The post అనుమానంతో భార్యపై ఇనుప రాడ్డుతో దాడి appeared first on Navatelangana.















