
లక్నో: కన్న కూతురును చంపి అనంతరం ఆమె ముఖంపై యాసిడ్ పోసి మృతదేహాన్ని కాలువలో పడేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరాబంకీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... విజయ్ కుమార్ చౌబీ అనే వ్యక్తి తన భార్య, కుమార్తెతో కలిసి జీవిస్తున్నాడు. గత కొంత కాలంగా కూతురు ప్రవర్తనలో మార్పు రావడంతో పలుమార్లు ఆమెను మందలించాడు. ఆమెలో మార్పు రాకపోవడంతో కారులో బయటకు తీసుకెళ్లి తన సహాయకుడు అబ్ధుల్ మన్నాన్ తో కలిసి కూతురు గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం ముఖంపై యాసిడ్ పోసి అనంతరం మృతదేహాన్ని బరాబంకీ జిల్లాలోని ఓ కాలువలో పడేశాడు. తన కూతురు కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు గుర్తు తెలియని మృతదేహాల వివరాలు తెలుసుకున్నాడు. బరాబంకీ జిల్లాలో బాలిక మృతదేహం కనిపించడంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. బాలిక తండ్రిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలోఏ ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమె ప్రవర్తనతో సమాజంలో పరువు పోతుందని తన కూతురును చంపుకున్నానని తండ్రి వివరణ ఇచ్చాడు.













