
హైదరాబాద్: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, అసోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లె క్కింపు కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ లో బిజెపి హవా కొనసాగుతోంది. తమిళనాడులో టివికె 101 సీట్లలో ఆధిక్యంలో ఉంది. తమిళ నటుడు విజయ్ స్థాపించిన టివికె పార్టీ సెంచరీ స్థానాలలో ఆధిక్యంతో విజృంభిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో టిఎంసి కూటమి (112), బిజెపి (174), కాంగ్రెస్(03), వామపక్షాలు(2), ఇతరులు(1) సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. తమిళనాడులో టివికె(101), డిఎంకె కూటమి (59), అన్నాడిఎంకె కూటమి(74), ఇతరులు(01), కేరళ రాష్ట్రంలో ఎల్ డిఎఫ్ (41), యుడిఎఫ్(98), ఎన్డిఎ (01) స్థానాలలో, అస్సాంలో బిజెపి కూటమి(96), కాంగ్రెస్ కూటమి(26), ఇతరులు(03), పుదుచ్చేరిలో ఎన్నార్ కాంగ్రెస్ కూటమి(17), కాంగ్రెస్ కూటమి(08), ఇతరులు(03) స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ సీట్లు.. మేజిక్ ఫిగర్ 148 సీట్లు
తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ సీట్లు.. మేజిక్ ఫిగర్ 118 సీట్లు
కేరళంలో మొత్తం 140 అసెంబ్లీ సీట్లు.. మేజిక్ ఫిగర్ 71 సీట్లు
అసోంలో మొత్తం 126 అసెంబ్లీ సీట్లు.. మేజిక్ ఫిగర్ 64 సీట్లు
పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ సీట్లు.. మేజిక్ ఫిగర్ 16 సీట్లు












