నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్‌లోని 15 పోలింగ్ బూత్‌లలో శనివారం రీపోలింగ్ జరపాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మగ్రహట్ పశ్చిమ నియోజకవర్గంలోని 11, డైమండ్ హార్బర్‌లోని నాలుగు బూత్‌లలో రీపోలింగ్ జరగనుంది. మరోవైపు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులనే నియమించాలన్న ఈసీ ఆదేశాలను తృణమూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
The post బెంగాల్‌లోని 15 బూత్‌లలో నేడు రీపోలింగ్ appeared first on Navatelangana.















