అహ్మదాబాద్: ఐపిఎల్‌లో భాగంగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య గుజరాత్ టైటాన్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ విరాట్ కోహ్లి 13 బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన దేవ్‌దుత్ పడిక్కల్ 24 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 40 పరుగులు సాధించాడు. కెప్టెన్ పటిదార్ 19 పరుగులు చేశాడు.

రొమారియో షెఫర్డ్ (17), వెంకటేష్ అయ్యర్ (12), భువనేశ్వర్ కుమార్ (15) పరుగులు చేశారు.మిగతా వారు విఫలం కావడంతో బెంగళూరు ఆశించిన స్కోరును సాధించలేక పోయింది. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో అర్షద్ ఖాన్ మూడు, రషీద్, హోల్డర్‌లు రెండేసి వికెట్లను పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 15.5 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. శుభ్‌మన్ గిల్ 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. జోస్ బట్లర్ (39), తెవాటియా 27 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించారు.