ప్రతి నియోజకవర్గంలో వెయ్యిమందికి ఆటోమేటిక్ యంత్రాల పంపిణీ

100 శాతం సబ్సిడీతో మంజూరు

బిసి సంక్షేమ శాఖ ఉత్తర్వులు

త్వరలో దరఖాస్తులు, కలెక్టర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక

ప్రక్రియ మహిళల స్వయం ఉపాధికి ఇది మరింత దోహదం చేస్తుంది: మంత్రి పొన్నం ప్రభాకర్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నైపు ణ్యం కలిగిన బిసి మహిళలకు టైలరింగ్ ఆధారి త స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి ఉత్పాదకతను పెంచి, టైలరిం గ్ వ్యాపార అవకాశాలను విస్తరించుకునేందుకు, స్వయం సమృద్ధిగల పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆటోమేటిక్ కుట్టు యంత్రాలను సరఫరా చేయాలని నిర్ణయించింది. నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలకు వంద శాతం సబ్సిడీ తో కుట్టు మిషన్లు మంజూరు చేసేలా ఉత్తర్వులు జారీ చేసింది. పథకం అమలుపై బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బాలమయాదేవి, బిసి కార్పొరేషన్ ఎండి మల్లయ్య బట్టు, ఇతర అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల పక్షాన మహిళలకు స్వ యం ఉపాధి కల్పించడానికి ప్రతి నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలకు కుట్టు మిషన్లు 100 శాతం సబ్సిడీతో మంజూరు చేయాలని నిర్ణయించిందన్నారు. త్వరలోనే వాటికి దరఖాస్తులు తీసుకొని జి ల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎం పిక ప్రక్రియ జరుగుతుందన్నారు. బలహీన వర్గాల మ హిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలకు చొప్పున స్వయం ఉపాధి పెంచుకొని ఆర్థికంగా ఆసరాగా ఎదగడానికి ఉపయోగపడుతుందన్నారు. బలహీన వర్గాల శాఖ పక్షాన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచడంతోపాటు, స్కిల్ డెవలప్మెంట్ లాంటి కార్యక్రమాలు చేయడానికి శాఖ ప్రణాళికలు చేస్తోందన్నారు.