
టీం ఇండియా, ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మకి ఓ చేదు అనుభవం ఎదురైంది. రోహిత్ కారులో నుంచి అభిమానులకు అభివాదం చేస్తుండగా.. ఇద్దరు చిన్నారులు వచ్చి ఆయన చేతికి ఉన్న వాచ్‌ని లాగే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన హిట్ మ్యాన్ తన చేతిని లోపలకి తీసుకొని.. వాచ్‌ని లాగే ప్రయత్నం చేసిన వారిని మందలిస్తూ.. కారు అద్దాన్ని పైకి ఎత్తేశాడు. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ.. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం వైరల్ అవుతోంది. రోహిత్ ధరించిన ఆ వాచ్ ఖరీదు రూ.3.25 కోట్లని తెలుస్తోంది. వాచ్ బ్రాండ్ పేరు రోలెక్స్ జిరాఫ్ అని సమాచారం.
ఇక రోహిత్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో బిజీగా ఉన్నాడు. సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లు గాయం కారణంగా దూరమైన రోహిత్, ఎంఐ, లక్నోతో జరిగిన మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో 44 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయినప్పటికీ.. ముంబైకి ఈ విజయం అంతగా కలిసి రాలేదు. ఎంతకంటే అప్పటికే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ ఆశలు దూరమయ్యాయి. ఇప్పుడు మిగిలిన నాలుగు మ్యాచుల్లో గెలిచినా.. ప్లేఆఫ్స్‌కి వెళ్లడం అసాధ్యమనే చెప్పాలి.













