
రోజురోజుకు వేడి తీవ్రత పెరుగుతోంది. దీంతో వేడి నుండి ఉపశమనం పొందడానికి చాలామంది ఇంట్లోకి కూలర్ కొంటుంటారు. మీరు కూడా కేవలం రూ.5,000 లోపు ధరలో రూమ్ కూలర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, మీకో గుడ్ న్యూస్! ఈ ధర పరిధిలో అనేక కంపెనీలు అద్భుతమైన ఫీచర్లతో ఎయిర్ కూలర్లను తీసుకువస్తున్నాయి. ఈ జాబితాలో బజాజ్, కెన్‌స్టార్, హవెల్స్, హిండ్‌వేర్ వంటి బ్రాండెడ్ కంపెనీల ఎయిర్ కూలర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో రూ.5,000 లోపు ధరలో లభించే ఎయిర్ కూలర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
బజాజ్ 25L ఎయిర్ కూలర్
బజాజ్ 25L ఎయిర్ కూలర్ 44% డిస్కౌంట్ తర్వాత కేవలం రూ.4,799 కే లభిస్తోంది. దీని ఎయిర్ త్రో 16 అడుగులు. ఇది ఇన్వర్టర్ కంపాటిబిలిటీ, 4-వే స్వింగ్, 3-స్పీడ్ కంట్రోల్ వంటి ఫీచర్లతో కూడా వస్తుంది. కాగా, దీనికి 1 సంవత్సరం వారంటీ ఉంది.
హిండ్‌వేర్ 25L కూలర్
25 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం గల ఈ ఎయిర్ కూలర్‌లో డస్ట్-ఫ్రీ ఫిల్టర్ టెక్నాలజీ, ఐస్ ఛాంబర్, హనీకోంబ్ ప్యాడ్‌లు ఉన్నాయి. ఇది ఇన్వర్టర్ కంపాటిబుల్. 46% తగ్గింపు తర్వాత ఈ కూలర్‌ను అమెజాన్‌లో రూ. 4,821 కు కొనుగోలు చేయవచ్చు.
హవెల్స్ 17L ఎయిర్ కూలర్
43% తగ్గింపు తర్వాత, 17 లీటర్ల నిల్వ సామర్థ్యం గల ఈ కూలర్ రూ. 4,999 కు అందుబాటులో ఉంది. 1 సంవత్సరం వారంటీతో వచ్చే ఈ ఎయిర్ కూలర్‌లో 3 స్పీడ్ సెట్టింగ్‌లు, ఇన్వర్టర్ అనుకూలత, వాటర్ లెవల్ ఇండికేటర్ ఉన్నాయి.
కెన్‌స్టార్ ఎయిర్ కూలర్ ఫర్ హోమ్:
15 అడుగుల ఎయిర్ త్రో సామర్థ్యం గల ఈ ఎయిర్ కూలర్‌లో హై-స్పీడ్ ఫ్యాన్, ఐస్ ఛాంబర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది ఇన్వర్టర్ అనుకూలత కలిగి ఉంది. 1 సంవత్సరం వారంటీతో వచ్చే ఈ కూలర్ 41% తగ్గింపు తర్వాత రూ. 4,699 కు అందుబాటులో ఉంది.
బజాజ్ 18L టవర్ కూలర్:
18 లీటర్ల నిల్వ సామర్థ్యం గల ఈ కూలర్ 36% తగ్గింపు తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 4,966 కు అమ్ముడవుతోంది. ఈ కూలర్‌కు ఒక సంవత్సరం వారంటీ ఉంది. ఇందులో స్పీడ్ కంట్రోల్, ఫైబర్ ప్లాస్టిక్ బాడీ వంటి ఫీచర్లు ఉన్నాయి.











