
మాజీ క్రికెటర్ శివరామకృష్ణ
ముంబై: ఐపిఎల్ 2026లో ఆటలో ప్రదర్శనకన్నా నిత్యం వివాదాల్లో నిలుస్తున్నారు. మొన్న రాజస్థాన్ రాయల్ కెప్టెన్ రియాన్ పరాగ్ క్రికెటర్ల గదిలో ఈసిగర్(వేపింగ్) తాగుతూ కెమెరాకు చిక్కగా.. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ స్టార్ స్పిన్నర్ ఏకంగా ఆటగాళ్లు ప్రయాణించే విమానంలో వేపింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. అందుకు సంబంధించి వీడియో నెట్టింట్లో వైరల్‌గా మార గా పలువురు మాజీలు, క్రికెట్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా మాజీ ఆటగాడు దీనిపై స్పందిస్తూ.. ‘చాహల్‌ను జైలో పెట్లాలని, ఇటువంటి చర్యలకు పాల్పడేవారిని కఠినం గా శిక్షించాలని పేర్కొన్నాడు. భారత్‌లో వేపింగ్‌పై నిషేధం ఉంది. ఉల్లఘించిన వారిపై చర్యలు తీసుకోకుండా మ్యాచ్ ఫీజులో 25శాతం కోత విధించడం చాలా చిన్న శిక్ష. నిబంధనలు ఉల్లఘించి చాహల్‌ను జైల్లో పెట్టాలి’ అని అన్నాడు.















